Type Here to Get Search Results !

TSPSC GROUPS STUDY MATERIAL

భారత రాష్ట్రపతి ఆర్టికల్ -52 ప్రకారం భారతదేశానికి రాష్ర్టపతి ఉంటారు. ఆయనే దేశంలో అత్యున్నత వ్యక్తి. ఆర్టికల్-53 ప్రకారం.. రాష్ర్టపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ర్టపతికే అప్పగించారు. ఆయనకు సహాయపడేందుకు ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టే ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా, రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా పేర్కొంటారు. అర్హతలు: రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి అర్హతల గురించి ఆర్టికల్-58 తెలియజేస్తుంది. దీని ప్రకారం.. 1. భారతీయ పౌరుడై ఉండాలి. 2. 35 ఏళ్లు నిండి ఉండాలి. 3. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. 4. అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి. 5. నామినేషన్ ఫీజుగా రూ.15,000 చెల్లించాలి. డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై చెల్లిన ఓట్లలో కనీసం 1/6 వంతు రావాలి. రాష్ట్రపతి ఎన్నిక: ఆర్టికల్-54 రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుపుతుంది. దీని ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్.. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా రాష్ర్టపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎన్నికైన పార్లమెంట్ (ఉభయసభలు) సభ్యులు, ఎన్నికైన అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల విధానసభ సభ్యులు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంత విధానసభ సభ్యులకు 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు కల్పించారు. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం సభ్యులు 4,896, మొత్తం ఓట్లు సుమారుగా 11,00,000. వీరిలో మొత్తం పార్లమెంట్ సభ్యులు 776, విధానసభ సభ్యులు 4120. మొత్తం ఓట్లలో పార్లమెంట్ సభ్యులు సుమారుగా 5,50,000, విధాన సభల సభ్యులవి సుమారుగా 5,50,000. ఆర్టికల్-55 ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ఓటు విలువను ప్రత్యేక పద్ధతి ద్వారా లెక్కిస్తారు. రాష్ర్టపతి ఎన్నికకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటున్నారు. ఉదా॥ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జనాభా 4,36,24,000. దీన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ MLA ఓటు విలువ ఈ విధంగా లెక్కిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన MLA ఓటు విలువ 148. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ (208), తమిళనాడు (176), మహారాష్ర్ట (175) ఓటు విలువను కలిగి ఉండగా, సిక్కిం (7), అరుణాచల్ ప్రదేశ్ (8), నాగాలాండ్ (9) అతి తక్కువ ఓటు విలువను కలిగున్నాయి. గమనిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ MLA ల ఓటు విలువ ఒకే రకంగా ఉంటుంది. పై సూత్రం ద్వారా ఎంపీ ఓటు విలువ ప్రస్తుతం ఒక్కో ఎంపీ ఓటు విలువ 708. అందరి ఎంపీల ఓటు విలువ సమానంగా ఉంటుంది. రాష్ర్టపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ కొనసాగుతారు. 2012 రాష్ర్టపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ వివేక్ కుమార్ అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా కొనసాగారు. ఇప్పటి వరకు 14 సార్లు రాష్ర్టపతి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నిక 1952లో, 14వ ఎన్నిక 2012లో జరిగింది పదవీ కాలం ఆర్టికల్-56 ప్రకారం రాష్ర్టపతి పదవీ కాలం ఐదేళ్లు. ఈ సమయంలో రాష్ర్టపతిగా కొనసాగేం దుకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవ చ్చు. రాజీనామా లేఖను ఉప రాష్ర్టపతికి సమర్పిం చాలి. ఉపరాష్ర్టపతి లేనట్లయితే ఒక ప్రతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ప్రతిని ప్రధానమంత్రికి అందించాలి. ఆర్టికల్-57 ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టాలి అనే సంప్రదాయం మొదటి రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ ద్వారా మొదలైంది. రాష్ర్టపతిగా ఎక్కువ కాలం రాజేంద్రప్రసాద్, తక్కువ కాలం జాకీర్ హుస్సేన్ కొనసాగారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.