Type Here to Get Search Results !

Telangana Movement and State Formation ,తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు మిలియన్ మార్చ్ (2011 మార్చి 10):

కె. సి.ఆర్. గారు 2011 మార్చి 10న హైద్రాబాద్ నగర నలుమూలల నుండి ట్యాంక్ బండ్ పైకి మిలియన్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చాడు నిర్వహించారు. ఈ మిలియన్ మార్చ్ అనేది ఈజిప్ట్ (కైరోలోని) తెహ్రీక్ చౌక్ దిగ్బంధనమును ఆదర్శంగా తీసుకొని నిర్వహించరు. ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న ఉద్యమకారులకు అక్కడ ఉన్న విగ్రహాలలో ఎక్కువగా ఆంధ్రుల విగ్రహాలు ఉండటంతో తెలంగాణ చరిత్రను, గొప్ప వ్యక్తులను మరుగున పడవేస్తున్నారని భావించి విగ్రహ ధ్వంసానికి పూనుకున్నారు. కలెక్టరేట్ల ముట్టడి (2011 జనవరి 10,11) శ్రీకృష్ణ కమిటీ సమైఖ్యాంధ్రప్రదేశ్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన టి.జె.ఎ.సి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా 2011 జనవరి 10, 11 తేదీలలో అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించింది.
సహాయ నిరాకరణోద్యమం (2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు) బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ సహాయనిరాకరణ కార్యక్రమం 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు మొత్తం 16 రోజుల పాటు జరిగింది. సకలజనుల సమ్మె (2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు) సకలజనుల సమ్మెను కూడా మూడు ప్రధాన లక్ష్యాలతో కొనసాగించారు. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని తెలంగాణ ఉద్యమ నాయకత్వంగా మార్చుకోవడం సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యం నుండి, భావజాలం నుండి విముక్తి చేసి వారిని ప్రజా ఉద్యమంలోకి, నాయకత్వంలోకి తీసుకొనిరావడం. తెలంగాణపై ఆధిపత్యం చేస్తున్న సీమాంధ్ర సంపన్న వర్గాలు, పెట్టుబడిదారుల పై పోరాటం చేయడం. 2011 సెప్టెంబర్ 12న “జనగర్జన సభ” కరీంనగర్ లో జరిగింది. ఈ సభలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస “సకలజనుల సమ్మె”కు పిలుపునిచ్చింది. 2011 సెప్టెంబర్ 13 నుండి సకలజనుల సమ్మె మొదలయింది. 2011 సెప్టెంబర్ 30న కాంగ్రెస్ కోర్ కమిటీ పిలుపుతో కె.సి.ఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, ఈటెల రాజేందర్ వంటి టి.ఆర్.ఎస్ నాయకులు, టి.జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నాయకులు అయిన స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, విఠల్ వంటి 40 మంది నాయకులు తెలంగాణపై సంప్రదింపుల కోసం ఢిల్లీకి వెళ్లారు. 2011 అక్టోబర్ 1న ఢిల్లీలో నివసించే తెలంగాణవాదులు కోదండరాం, స్వామి గౌడ్ ల నాయకత్వంలో ఆంధ్రభవన్ నుండి ఇండియాగేట్ దాకా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. 2011 అక్టోబర్ 2న కె.సి.ఆర్, కోదండరాం, స్వామిగౌడ్ బృందము రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి దగ్గర మౌనదీక్ష చేశారు. సెప్టెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగి అక్టోబర్ 24న ముగిసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష (2011 నవంబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు): నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2011 నవంబర్ 1 నుండి నవంబర్ 9 వరకు నల్గొండ క్లాక్ టవర్ వద్ద నిరాహార దీక్షను చేశాడు. ఇదే సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12 మంది స్వాతంత్ర్య సమర యోధులతో కలిసి నవంబర్ 1 నుండి 7 వరకు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. 2011లో ప్రారంభమైన దీక్షలు సిద్దిపేట, అదిలాబాద్, బోధన్ లలో తెలంగాణ వచ్చేదాకా కొనసాగాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.